'మోదీ ఆలోచనే పెద్దికి ఆదర్శం'.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్

Published on Mon, 06/08/2026 - 17:26

రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ నెల 4న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 292 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది.

తాజాగా పెద్ది టీమ్ హైదరాబాద్‌లో థ్యాంక్ యూ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్‌ బుచ్చిబాబుతో పాటు హీరో రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పెద్ది మూవీ కథకు స్ఫూర్తి ఏంటనే విషయాన్ని రివీల్ చేశారు. ఇది ఒక ఆదర్శమైన కథ అని తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను బయటి ప్రపంచానికి పరిచయం పెద్ది మూవీ ఉద్దేశమని బుచ్చిబాబు అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఖేలో ఇండియానే పెద్ది కథకు స్ఫూర్తి అని తెలిపారు. మట్టిలో ఆటగాళ్లను వెతుకుదాం.. ఓట్లలాగే ఇంటింటికి వెళ్లి ఆటగాళ్లను కూడా అడుక్కుందాం అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇండియాకు మెడల్స్ తీసుకొచ్చేలా గ్రామీణ మారుమూల ‍ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడమే ఖేలో ఇండియా ఉద్దేశమన్నారు. భారత జీవన విధానంలోనే ఆట కూడా ఓ భాగమని చెప్పాలనుకున్నా.. అందుకే పెద్దిని మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. పెద్ది అనేది కమర్షియల్ చిత్రం కాదన్నారు. ఈ మూవీ గ్రామీణ క్రీడాకారుందరికీ ఆదర్శమని బుచ్చిబాబు తెలిపారు. 
 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)