Breaking News

'పెద్ది'.. రూ.100 టికెట్ రూ.420

Published on Wed, 06/03/2026 - 15:19

'పెద్ది' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆంధ్రా, ఓవర్సీస్‌లో రెండు మూడు రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ తెలంగాణలో మాత్రం రిలీజ్‌కి కొన్ని గంటల ముందు తెరిచారు. ఇక తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌పై రూ.150 పెంచుకోవచ్చని పేర్కొన్నారు. కానీ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం ఒక్కో టికెట్ రూ.420 ఉండటం షాకిచ్చింది.

(ఇదీ చదవండి: 'పెద్ది' బడ్జెట్ ఎంత? అంచనాలు ఎలా ఉన్నాయి?)

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70ఎమ్ఎమ్ థియేటర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ థియేటర్‌లో రిలీజ్ రోజు నుంచి రెగ్యులర్ షోల కోసం టికెట్ రూ.420 అన్నట్లు బుక్ మై షోలో చూపించింది. మిగతా సింగిల్ స్క్రీన్లలో సెకండ్ క్లాస్ టికెట్ పెంపుతో కలిపి రూ.150 రూపాయలు ఉంటే దేవిలో మాత్రం రూ.420 ఉంది. దీంతో పలువురు నెటిజన్లు ఈ పెంపుపై విమర్శలు చేస్తున్నారు.

ఎందుకంటే ఏఎంబీ, ఏఏఏ లాంటి మల్టీప్లెక్స్‌ల్లో రూ.420, దేవి లాంటి సింగిల్ స్క్రీన్‌లోనూ రూ.420 టికెట్ రేటు ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రస్తుతానికైతే సినిమాపై బజ్ బాగానే ఉంది గానీ ఈరోజు రాత్రికల్లా అసలు టాక్ ఏంటనేది బయటకొస్తుంది. అప్పుడు టికెట్ సేల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపించడం గ్యారంటీ.

'పెద్ది' ప్రీ సేల్స్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్లకు పైనే టికెట్ సేల్స్ జరిగినట్లు అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మరి తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'పెద్ది' కలెక్షన్ల హంగామా)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)