‘ఓజీ’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

Published on Thu, 09/25/2025 - 14:05

 పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను మాత్రం ఈ సినిమా అందుకోలేపోయింది. సాంకేతికంగా సినిమా బాగున్నా.. కథ-కథనం అంతగా ఆకట్టుకోలేకపోయిందని పలు రివ్యూస్‌ చెబుతున్నాయి. 

(‘ఓజీ’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఎలివేషన్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టి.. కథనాన్ని గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రిలీజ్‌ ముందు ఉన్నంత అయితే హైప్‌ ఇప్పుడు లేదు. మరి ఈ ప్రభావం కలెక్షన్స్‌పై ఉంటుందో లేదో వీకెండ్‌లో తెలిసిపోతుంది.  ఇక ఈ సినిమాకు టికెట్‌ రేట్లు అధికంగా పెంచడంతో సాధారణ సినీ ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.  నాలుగు రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అని చాలా మంది అనుకుంటున్నారు. నెట్టింట కూడా ఓజీ ఓటీటీ రిలీజ్‌పై  ఆరా తీస్తున్నారు. ఏ ఓటీటీలో వస్తుంది.. ఎప్పుడు వచ్చే  అవకాశం ఉంది.. తదితర విషయాల గురించి ఎక్కువగా సెర్చ్‌ చేస్తున్నారు. 

ఆ ఓటీటీలోనే.. 
ఓజీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 80 కోట్లకు వరకు చెల్లించినట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే రిలీజ్‌ అయిన నాలుగు వారాల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. ఈ ఒప్పందంతోనే నెట్‌ఫ్లిక్స్‌ అంత డబ్బు పెట్టి  ఓటీటీ రైట్స్‌ తీసుకుందట. ఈ లెక్కన అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ  సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)