Breaking News

కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్

Published on Mon, 07/21/2025 - 13:23

పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకొన్నారు. టాలీవుడ్‌లో చాలామంది హీరోల్లో తను ఒకడినే తప్ప పెద్ద గొప్పేం కాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోలతో పోలిస్తే తాను చాలా తక్కువని కూడా అన్నారు. ఈయన నటించిన 'హరిహర వీరమల్లు'.. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఫైనల్‌గా జూలై 24న అంటే ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన)

ఇందులోనే మాట్లాడిన పవన్.. 'రాజకీయంగా నాకు పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలుసుండొచ్చు కానీ సినిమాల పరంగా చూస్తే కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువనే. దానికుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్లకు బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ అవ్వదు. వాళ్లకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ నేను సినిమాలపై పెట్టలేదు' అని చెప్పుకొచ్చారు.

మరో సందర్భంలో మాట్లాడుతూ.. 'నువ్వు చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా.. చివరికి నా కొడుకైనా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం' అని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. పవన్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయన అభిమానులకు ఇది చెవికెక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మా హీరో స్టార్, సూపర్‌స్టార్ అని ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఇప్పటికైనా వాళ్లు అర్థం చేసుకుని మారతారా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: 'ఫిష్‌ వెంకట్‌'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్‌)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)