Breaking News

కొడుకు పేరు రివీల్ చేసిన హీరోయిన్.. అలాంటి అర్థం వచ్చేలా!

Published on Wed, 11/19/2025 - 15:42

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా గతనెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ పొలిటీషియన్  రాఘవ్ చద్దాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. రెండేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 19న మొదటి బిడ్డను తమ జీవితంలో ఆహ్వానించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

తాజాగా తమ ముద్దుల చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించారు ఈ జంట. బాబు పుట్టిన నెల రోజులకు పేరు పెట్టారు.  తమ బిడ్డకు నీర్‌ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జలస్య రూపం, ప్రేమస్య స్వరూపం - తత్ర ఏవ నీర్.. మా హృదయాలు జీవితంలో శాశ్వతమైన శాంతిని పొందాయి.. మా అబ్బాయికి నీర్‌ అని పేరు పెట్టాం అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నీర్ అంటే స్వచ్ఛమైన, దైవిక, పరిమితం లేని అనే అర్థం వస్తుందని వెల్లడించారు. పరిణీతిలోని నీ... రాఘవ్‌లోని రా కలిసి వచ్చేలా తమ ముద్దుల బిడ్డకు నామకరణం చేశారు.

(ఇది చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్)

ఈ ఏడాదిలో ఆగస్టులో పరిణీతి, రాఘవ్  ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. వీరిద్దరు సెప్టెంబర్ 2023లో  పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్‌ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌లో మాత్రమే నటించింది.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)