Breaking News

నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త

Published on Mon, 01/19/2026 - 12:28

'కాంటా లగా..' పాటతో ఫేమస్‌ అయిన బాలీవుడ్‌ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్‌ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

అదే కారణం
ఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్‌ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్‌ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ..  దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.

ఒక్కసారి కాదు, రెండుసార్లు
చాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. 

చేయిదాటిపోయింది
నాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లోనూ పాల్గొంది.

చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు