రామాయణ రిలీజ్‌.. పాకిస్తాన్‌లో సంబరాలు..!

Published on Thu, 10/29/2026 - 18:25

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే కాలిఫోర్నియాలో రామాయణ ప్రీమియర్ షో సైతం ప్రదర్శించారు.

అయితే ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లోని హిందువులు సైతం రామాయణ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో హిందూ ఈ మూవీ పోస్టర్స్‌ను ప్రదర్శించింది. హ్యాపీ దీపావళి అంటూ రామాయణ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను  స్థానిక యూట్యూబర్ పంచుకున్నారు. అంతేకాకుండా రామాయణ సినిమా పోస్టర్‌ పట్టుకుని వీధుల గుండా తిరుగుతూ ఒక ఆలయం వద్ద ప్రదర్శించారు. ఈ సందర్భంగా రామాయణ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కొందరైతే ఈ చిత్రం ఆస్కార్ గెలవాలని ఆకాంక్షించారు.

వారిలో ఒకరు మాట్లాడుతూ.. "పాకిస్తానీ హిందువులుగా మాకు రామాయణం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. దాని కాలాతీత కథ, సాంస్కృతిక ప్రాముఖ్యత మనల్ని మన సంప్రదాయాలతో, తరతరాల వారసత్వంతో అనుసంధానం చేస్తుంది. ఈ వేడుక ద్వారా మా ఆనందాన్ని పంచుకుంటున్నాం. రామాయణ చిత్ర బృందానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాం" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రావణుడిగా కేజీఎఫ్ హీరో యశ్ కనిపించనున్నారు. ఈ మూవీని నమిత్ మల్హోత్రా నిర్మించగా.. పార్ట్-1 నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 
 

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)