ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్

Published on Tue, 02/17/2026 - 16:42

మలయాళ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సౌబిన్ షాహిర్.. గతేడాది వచ్చిన 'కూలీ'తో మిగతా దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మూవీ చేస్తూనే ఉంటాడు. అలా ఇతడి పోలీస్ కానిస్టేబుల్‌గా చేసిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. దాదాపు నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి వస్తుంది?

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

2000-10 మధ్య హీరోయిన్‌గా ఫేమస్ అయిన నవ్య నాయర్ తర్వాత అప్పుడో ఇప్పుడో అన్నట్లు ఒకటి రెండు సినిమాలు చేస్తూ వస్తోంది. ఈమె, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ సినిమా 'పాతిరాత్రి'. ఈ టైటిల్‌కి అర్థరాత్రి అని అర్థం. గతేడాది అక్టోబరు 17న థియేటర్లలో రిలీజైంది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం చాన్నాళ్ల తర్వాత అంటే ఈ శుక్రవారం(ఫిబ్రవరి 20) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

'పాతిరాత్రి' విషయానికొస్తే.. ఝాన్సీ కురియన్(నవ్వ నాయర్) ఎస్సై. హరీష్(సౌబిన్ షాహిర్) ఓ కానిస్టేబుల్. ఓ రోజు రాత్రి గస్తీలో ఉన్నప్పుడు ఓ అనుమానాస్పద వ్యక్తిని వెంబడిస్తారు. తర్వాత అతడు అదృశ్యమవుతాడు. తర్వాత రోజు అతడి మృతదేహం దొరుకుతుంది. దీంతో పోలీసులిద్దరూ నిందితులు అవుతారు. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)