Breaking News

ప్రాణాలతో చెలగాటమాడే గేమ్‌.. ఫైనల్‌ సీజన్‌ ట్రైలర్‌ చూశారా?

Published on Sun, 06/01/2025 - 12:01

ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించాలన్న దానికన్నా ఎలాగోలా సొంతం చేసుకోవాలన్న ఆశే ఎక్కువవుతోంది. ఇందుకోసం అడ్డదారులు తొక్కేవారు కొందరైతే అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకునేవాళ్లు మరికొందరు. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. డబ్బు మనిషి ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? డబ్బు కోసం మనిషి ఎంతదూరం వెళ్తాడన్న అంశంపై తెరకెక్కిన సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌.

ప్రాణాంతక గేమ్‌
ఈ సిరీస్‌ ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేసింది. గేమ్‌లో గెలిస్తే చాలు.. కలలో కూడా ఊహించలేనంత డబ్బు మీ సొంతం అనడంతో వందలాది మంది గేమ్‌ ఆడేందుకు వెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక గేమ్‌లో ఓడినవారి ప్రాణాలు తీస్తారు. తమ గెలుపు కోసం కొందరు ప్లేయర్స్‌ పక్కవారి ప్రాణాలు తీయడానికీ వెనకాడరు. చివరకు ఒకే ఒక్కరు విజేతగా నిలిచి డబ్బు గెలుచుకుంటారు. అలా ప్లేయర్‌ 456 ఓసారి గేమ్‌లో గెలిచి కోట్లాది ధనం పొందుతాడు. 

కోట్లు గెలిచినా దక్కని సంతోషం
కానీ అందరి చావులను కళ్లారా చూసిన అతడికి ఆ విజయం సంతోషాన్నివ్వకపోగా మరింత బాధపడతాడు. అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటున్న ఈ ఆటకు ఎలాగైనా ముగింపు పలకాలని మరోసారి గేమ్‌లో అడుగుపెడతాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండగా రెండో సీజన్‌ ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మూడో సీజన్‌ వచ్చేస్తోంది. జూన్‌ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫైనల్‌ సీజన్‌ ప్రసారం కానుంది. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

ఆటకు ముగింపు?
ఫస్ట్‌ సీజన్‌లో రెడ్‌ లైట్‌- గ్రీన్‌ లైట్‌ అని గేమ్‌ ఆడించిన ఓ బొమ్మను మరోసారి ఈ సీజన్‌లో ప్రవేశపెట్టారు. ఈ సారి గేమ్‌ మరింత క్రూరంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. ప్లేయర్‌ 456.. పాశవికమైన ఆట ఆడిస్తున్న వ్యక్తిని నేరుగా కలిసినట్లు చూపించారు. మరి అతడు ఈ ఆటను ఆపగలిగాడా? లేదా? అనేది తెలియాలంటే ఈ నెలాఖరులో స్క్విడ్‌ గేమ్‌ చివరి సీజన్‌ చూసేయాల్సిందే!

 

చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్‌-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)