Breaking News

ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!

Published on Fri, 05/05/2023 - 13:47

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల కంటే ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసలే సమ్మర్‌ హాలీడేస్ కావడంతో కుటుంబమంతా ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూసేస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసమ సరికొత్త సినిమాలు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ చిత్రాలేలో ఓ లుక్కేద్దాం.

 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లవ్ స్టోరీ
ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత  నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేష్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మే 5వ తేదీ నుంచి సన్‌ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

కిరణ్ అబ్బవరం మీటర్
యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అతుల్య రవి  నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్‌ అబ్బవరం పోలీస్‌ పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 7న విడుదల కాగా..  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?
గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో రూపొందించిన  చిత్రం 'ఆగస్టు 16.. 1947'. ఈ చిత్రంలో రేవతి శర్మ, పుగాజ్‌, రిచర్డ్‌ ఆష్టన్‌, జాసన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెంట్‌ కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే వెబ్ సిరీస్‌లు/ చిత్రాలివే

నెట్‌ఫ్లిక్స్‌

    శాంక్చురీ - మే 4
    ది లార్వా ఫ్యామిలీ-యామినేషన్‌- మే 4
    తూ ఝూటీ మై మక్కార్‌ -హిందీ- మే 5
    3-తెలుగు- మే 5

    అమృతం చందమామలో -తెలుగు- మే 5
    యోగి -తెలుగు- మే5
    రౌడీ ఫెలో -తెలుగు- మే 5
    తమ్ముడు -తెలుగు- మే 5

జీ 5

    ఫైర్‌ ఫ్లైస్‌ -హిందీ సిరీస్‌- మే 5
    షెభాష్‌ ఫెలూద -బెంగాలీ- మే 5

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

    కరోనా పేపర్స్‌ -మలయాళ మూవీ- మే 5
    సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో -హిందీ- మే 5

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)