Breaking News

జనవరిలో నిశ్చితార్థం.. పెళ్లి కూతురు కాబోతున్న ఆరెంజ్‌ నటి..!

Published on Tue, 06/03/2025 - 17:15

ప్రముఖ బాలీవుడ్ నటి షాజన్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనుంది. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ ఈనెల 5న జరగనుంది. ఈనెల 3న హల్దీ వేడుకతో షాజన్‌ పదమ్సీ పెళ్లి సందడి మొదలు కానుంది. ఈ ఏడాది జనవరి 20న ఆశిశ్ కనకియాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ.. తాజాగా పెళ్లి చేసుకోనుంది. ఇవాళ సాయంత్రం హల్దీ వేడుకలో పెళ్లి సందడి షూరూ కానుంది.

జూన్ 5న పెళ్లి వేడుక తర్వాత స్నేహితుల, సన్నిహితుల కోసం ముంబయిలో గ్రాండ్‌గా సంగీత్‌తో పాటు రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. కాగా.. షాజన్ పదమ్సీ, ఆశిశ్ కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత జనవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెకు కాబోయే భర్త ఆశిశ్ మూవీమాక్స్ సినిమాస్ సీఈవోగా పనిచేస్తున్నారు.

(ఇది చదవండి:  ఐపీఎల్ ఫైనల్‌.. వార్‌-2 టీమ్ స్పెషల్ సర్‌ప్రైజ్‌!)

ఇక షాజన్ సినీ కెరీర్‌ విషయానికొస్తే హౌస్‌ఫుల్‌-2 చిత్రంతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.  అంతకుముందు రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, దిల్ తో బచ్చా హై జీ లాంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తెలుగులో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్‌, వెంకటేశ్ సినిమా మసాలాలోనూ కీలక పాత్రల్లో మెప్పించింది. ఆ తర్వాత తమిళంలోనూ కనిమొజి అనే సినిమాలో కనిపించింది. ఇటీవల  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన వెబ్ సిరీస్ హై జునూన్‌లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించనుంది. 

 

Videos

సెల్ఫీ వీడియో వైరల్.. జగనన్న..ఈ అవమానం భరించలేను

Khairatabad Ganesh: ఈ సంవత్సరం మరో ప్రత్యేక ఆకారంలో దర్శనం

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై YS జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం

బక్రీద్ సందర్భంగా ముస్లింలకు YS జగన్ శుభాకాంక్షలు

టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!

నారాయణరెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన YS జగన్

ఆ రోజు మానవజాతి శ్వాస ఆగిపోతుందా?

పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడికి కారణం అదే.. మోదీ కీలక వ్యాఖ్యలు

Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!

Photos

+5

'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)

+5

అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)

+5

ఇంజనీరింగ్‌ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్‌ బ్రిడ్జి (ఫొటోలు)

+5

Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ వివాహం (ఫోటోలు)

+5

సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)

+5

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైన గిల్ సేన‌ (ఫోటోలు)

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)