Breaking News

'ఆపరేషన్ వాలంటైన్' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. వచ్చేది అప్పుడేనా?

Published on Fri, 03/01/2024 - 11:20

దేశభక్తి నేపథ్యంలో మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలంటైన్'. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైపోయింది. గురువారం సాయంత్రమే ప్రీమియర్లు పడగా పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ కూడా ఎవరనేది తెలిసిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమా రివ్యూ)

మెగాహీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే ఒక్కో చిత్రం భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అలా పుల్వామా దాడి, భారత్-పాక్ వైరం తదితర అంశాలతో తీసిన చిత్రమే 'ఆపరేషన్ వాలంటైన్'. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చేస్తుంది. మిగతా వాళ్లకు మాత్రం నచ్చడం నచ్చకపోవడం అనేది చెప్పలేం.

ఇకపోతే 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల డీల్ మాట్లాడుకున్నారని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు సంబంధించి నెలలోపు స్ట్రీమింగ్ అవ్వొచ్చు. హిందీ వెర్షన్ మాత్రం ఎనిమిది వారాల తర్వాత ఉండనుందని సమాచారం.

(ఇదీ చదవండి: యాంకర్‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)