ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా

Published on Tue, 08/04/2026 - 14:21

ప్రతివారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ‍దాదాపు నెల, ఆ తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం మరీ మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేసేస్తుంటారు. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీకి సంబంధించిన ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)

'సంక్రాంతి వస్తున్నాం'తో మంచి ఫేమ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్.. తర్వాత పలు చిత్రాలు చేసింది. వాటిలో 'ఓ సుకుమారి' ఒకటి. తిరువీర్ హీరో కాగా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రూరల్ కామెడీ రొమాంటిక్ కథతో తీసిన ఈ చిత్రం గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అంటే ఈ శుక్రవారం (ఆగస్టు 07) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

'ఓ సుకుమారి' విషయానికొస్తే.. యాద‌గిరి(తిరువీర్‌) తన ప‌క్క ఊరిలోని ఓ అమ్మాయిని చూడ‌టానికి వెళ్లి దామిని(ఐశ్వ‌ర్య రాజేశ్‌)పై మ‌న‌సు ప‌డ‌తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ ఊళ్లో కూడా ఎలాగైనా దామినికి పెళ్లి చేసి సాగ‌నంపాల‌నేది గ్రామ‌స్తుల ప్లాన్‌. దానికి కార‌ణం ఆమెకొక విచిత్ర‌మైన స‌మ‌స్య ఉండ‌ట‌మే. ఆమెను ముట్టుకోగానే షాక్‌ కొడుతుంది. ఆ స‌మ‌స్య వ‌ల్ల ఊళ్లో వాళ్లు చాలా ర‌కాలుగా ఇబ్బందులు ప‌డుతుంటారు. అందుకే యాది ఇష్ట‌ప‌డ‌ట‌మే ఆల‌స్యం... ఊరంతా క‌లిసి  దామిని పెళ్లిని ఘ‌నంగా చేసి సాగ‌నంపుతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

అస‌లు చిక్కులు తర్వాతే మొద‌ల‌వుతాయి. ముట్టుకుంటేనే షాక్ కొట్టే దామినితో యాద‌గిరి కాపురం ఎలా చేశాడు? అత్తారింట్లో దామిని ఎలా క‌లిసిపోయింది? ఆమెకున్న షాక్ స‌మ‌స్యని త‌న భ‌ర్త, ఊరి జ‌నాలు ఎప్పుడు ఎలా తెలుసుకున్నారు? యాది పెళ్లి  చేసుకోవాల‌నే నిర్ణ‌యం వెన‌కున్న బ‌ల‌మైన ఆ కార‌ణాలేమిటి? అనేది మిగతా స్టోరీ.

ఇకపోతే ఈ వారం ఈ సినిమాతో పాటు లెనిన్, హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా తదితర హిట్ చిత్రాలు.. అలానే వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. మొత్తంగా 23 వరకు మూవీస్, సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)