Breaking News

బిగ్‌ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!

Published on Fri, 11/03/2023 - 16:12

బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది.  సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎల్విష్ యాదవ్‌పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్ పార్టీలను నిర్వహించారని అతనిపై ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. 

నోయిడాలోని ఫామ్‌హౌస్‌ల్లో ఎల్విష్, ఇతర యూట్యూబర్లతో కలిసి పాములు, వాటి విషంతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పీపుల్ ఫర్ యానిమల్ (పీఎఫ్‌ఏ) సంస్థ అధికారి గౌరవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని.. అంతే కాకుండా విదేశీ మహిళలతో పాటు పాము విషం, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని గౌరవ్ ఆరోపించారు. 

దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అటవీ శాఖ అధికారులతో కలిసి సెక్టార్ -51 సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న ఢిల్లీకి చెందిన రాహుల్, టిటునాథ్, జయకరన్, నారాయణ్, రవినాథ్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 మిల్లీలీటర్ల పాము విషం, ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు రెండు తలల పాములు, ఒక ఎలుక పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఎల్విష్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

కాగా..  ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ OTT సీజన్ 2లో విన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఊర్వశి రౌతేలాతో కలిసి 'హమ్ తో దీవానే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. అయితే పోలీసుల ఆరోపణలను ఎల్విష్ యాదవ్ ఖండించారు. ఇదంతా అసత్యమని.. అలాంటిదేం జరగలేదని కొట్టిపారేశాడు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)