Breaking News

2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Published on Wed, 09/03/2025 - 14:18

ఓటీటీల్లో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వీటిలో థ్రిల్లర్,  హారర్, యాక్షన్.. ఇలా వివిధ జానర్స్ ఉంటాయి. అయితే చాలామంది యాక్షన్ లేదా థ్రిల్లర్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

యాక్షన్ సినిమాలనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. అందుకు తగ్గట్లే 2021లో వచ్చిన 'నోబడీ'.. ఈ జానర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాల్లో ఇది టాప్-10లో ఉండటం విశేషం. దీనికి సీక్వెల్ 'నోబడీ 2'.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ వచ్చింది. మరి ఏమైందో ఏమో గానీ రెండు వారాలు తిరిగేసరికల్లా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. మరి వారం పదిరోజుల్లో మన దగ్గర కూడా రావొచ్చు.

'నోబడీ 2' విషయానికొస్తే.. భార్య, పిల్లలతో కలిసి హీరో విహారయాత్రకు వెళ్తాడు. అక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు అనుకోకుండా చేసిన ఓ పని వల్ల చిన్న గొడవ జరుగుతుంది. అది కాస్త పెద్దది అయి.. ఓ కోటీశ్వరుడి సామ్రాజ్యాన్ని నేలకూల్చే వరకు వెళ్తుంది. మరి హీరో.. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ప్రారంభం నుంచి చివరివరకు కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ఉంటాయి. చిన్న గ్యాప్ అనేది లేకుండా యమ స్పీడుగా వెళ్తుంది. నిడివి కూడా గంటన్నర కావడం ఇక్కడ విశేషం.

(ఇదీ చదవండి: 'వీరమల్లు'కు జీఎస్‌టీ చెల్లించలేదు.. ఎలా అనుమతిచ్చారు?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)