Breaking News

'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి

Published on Fri, 01/26/2024 - 12:24

మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు.

(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు.

అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)