Breaking News

టాలీవుడ్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి?

Published on Sun, 06/15/2025 - 16:30

ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్లు.. టాలెంట్‌తో పాటు ఫిజిక్ కూడా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు బ్యూటీస్ మాత్రం గ్లామర్‌ని నమ్ముకోకుండా యాక్టింగ్‌తో అలరిస్తూ ఉంటారు. నటనకు స్కోప్ ఉండే మూవీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లలో నివేదా థామస్ ఒకరు. తాజాగా గద్దర్ అవార్డుల్లో కనిపించిన ఈమె.. అందరికీ ఓ రకంగా షాకిచ్చింది. ఎందుకంటే చాలా మారిపోయింది.

(ఇదీ చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)

కేరళకు చెందిన నివేదా థామస్.. కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటుంది. బాలనటిగానే పలు సినిమాలు చేసిన నివేదా.. 2016లో వచ్చిన నాని 'జెంటిల్‌మేన్' మూవీత తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వి, వకీల్ సాబ్ తదితర చిత్రాల్లో నటించింది. చివరగా '35: ఇది చిన్న కథ కాదు'లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీకే ఉత్తమ నటిగా ఈమెని గద్దర్ అవార్డ్ వరించింది.

తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. నివేదా థామస్ కూడా హాజరైంది. కానీ పూర్తిగా చబ్బీగా కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈమెని చూసి ఏంటి నివేదా ఇలా మారిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే నివేదా చేతిలో కొత్త సినిమాలేం లేవు. మరి నివేదా ఇంతలా మారిపోవడానికి వేరే ఏదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)