Breaking News

ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా

Published on Sun, 08/31/2025 - 14:42

టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ ప్రేమలో ఉంది. వినాయక చవితి సందర్భంగా తన ప్రియుడిని పరిచయం చేసింది. దుబాయికి చెందిన బిజినెస్‌మ్యాన్ రజిత్ ఇబ్రాన్‌తో రిలేషన్‌లో ఉన్నాననే విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది. అయితే అసలు ఈ ప్రేమకథ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? తదితర విషయాల్ని ఇప్పుడు స్వయంగా నివేతా రివీల్ చేసింది.

మధురైలో  పుట్టి పెరిగిన నివేతా.. 2016లో ఓ తమిళ సినిమాతో నటిగా మారింది. 'మెంటల్ మదిలో' అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చిత్రలహరి, బ్రోచేవారెవరా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం, దాస్ కా దమ్కీ తదితర మూవీస్ కూడా చేసింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేవు. అయితే ఓవైపు నటిస్తూనే దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది.

(ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టించే మూవీ.. చేయని తప్పుకు అమ్మాయి జీవితం బలి!)

స్వతహాగా హీరోయిన్ అయినప్పటికీ రేసింగ్, బ్యాడ్మింటన్‌లోనూ నివేతాకు ప్రతిభ ఉంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం దుబాయిలో ఓ రేసింగ్ సందర్భంగా రజిత్‌తో తనకు పరిచయమైందని నివేతా చెప్పింది. తొలుత స్నేహితులుగానే ఉన్నామని, కొన్నాళ్లకు ఇద్దరం అనుకుని ప్రేమికులు అయ్యామని చెప్పింది. తన సర్కిల్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తన ప్రేమ గురించి తెలుసని, ఇండస్ట్రీలోనూ ఎవరికీ ఈ విషయం తెలియదని పేర్కొంది. తన ప్రేమ గురించి బయటపెట్టడం తన మేనేజర్‌తో సహా అందరికీ షాక్ అని తెలిపింది.

ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశామని చెప్పిన నివేతా.. అక్టోబరులో నిశ్చితార్థం చేసుకుంటామని రాబోయే జనవరిలో పెళ్లి ఉంటుందని పేర్కొంది. తేదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి కుటుంబాలు దుబాయిలో ఉంటున్నాయని, అలానే తమ వివాహాన్ని సింపుల్‌గా సన్నిహితుల సమక్షంలో చేసుకుంటామని నివేతా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ‘థాంక్యూ జగన్ గారు’.. అల్లు అర్జున్‌ ట్వీట్‌)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)