పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

Published on Sun, 06/14/2026 - 21:08

కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)

ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్‌గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.

నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉ‍న్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.

(ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)