'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?

Published on Mon, 07/27/2026 - 15:04

నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్‌ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.

(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)

'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు'

'ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.

రియా యాదవ్ ఎవరు?
రియా యాదవ్‌ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్‌, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ ప్రకారం.. మ్యూజిక్‌ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్‌' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్‌స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.

(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)