Breaking News

నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ .. ఆడియన్స్‌కు సవాల్ విసిరిన హీరో!

Published on Fri, 04/18/2025 - 19:42

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, రాశి సింగ్ జంటగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్‌ బ్లైండ్ స్పాట్.  ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర తన అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరారు. బ్లైండ్‌ స్పాట్ మూవీ పోస్టర్‌లోనే ఓ క్లూ ఉందని.. అది కనిపెట్టిన వారితో తానే స్వయంగా థియేటర్లో మూవీ చూస్తానని అన్నారు.

నవీన్ చంద్ర మాట్లాడుతా..'బ్లైండ్ స్టాట్ పోస్టర్‌లోనే ఓ క్లూ ఉంది. ఆ క్లూ ఎవరైతే కనిపెట్టి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేస్తే వారిని వ్యక్తిగతంగా కలుస్తా. అలాగే వారితో కలిసి థియేటర్లో సినిమా చూస్తా. ఈ మూవీపై నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈ విషయాన్ని నిర్మాత చెప్పలేదు, డైరెక్టర్‌ చెప్పలేదు. నేనే వ్యక్తిగతంగా చెబుతున్నా. అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. యాక్టర్ ఫర్మామెన్స్, టెక్నీషియన్స్ వర్క్‌తో ఈ కథను ఆడియన్స్‌ను ఎలా మెప్పించాలో రాకేశ్‌ పనిని చూసి బానిసను అయిపోయా' అని అన్నారు.

ఇవాళ విడుదలైన బ్లైండ్ స్పాట్ ట్రైలర్‌ చూస్తే ఓ అమ్మాయి ఆత్మహత్య చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లో సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పెడద, హర్ష రోషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 

 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌