విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని

Published on Wed, 02/25/2026 - 10:55

టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్‌పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్‪‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)

విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)