భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
ఓటీటీకి ది ప్యారడైజ్.. అఫీషియల్ ప్రకటన
Published on Sun, 10/18/2026 - 11:44
నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఓ జాతి మనుగడ కోసం చేసే పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ అనుకన్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈనెల 22 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని వెల్లడించారు. థియేటర్లలో రాణించలేని ఈ మూవీ ఓటీటీ ప్రియులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఈ సినిమా ఓటీటీలో థియేట్రికల్ వర్షన్ ఉంటుందా? లేదా అదనంగా ఇంకా ఏమైనా సీన్స్ యాడ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా.. మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించారు. ఈ మూవీలో సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు.
Welcome to Jadal zamana ❤️🔥 https://t.co/YUttNN6mzx
— Netflix India South (@Netflix_INSouth) October 18, 2026
Tags : 1