Breaking News

నిరీక్షణకు తెరపడింది.. డాకు మహారాజ్‌ ఓటీటీ డేట్ ఫిక్స్

Published on Sun, 02/16/2025 - 10:49

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ రావడంతో ఓటీటీ కోసం సినీ ప్రియులు, నందమూరి బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గతంలోనే ఓటీటీకి వస్తుందని భావించినా అది జరగలేదు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈనెల 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. దీంతో ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

డాకు మాహారాజ్‌ కథేంటంటే..

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్‌ ఖేడ్కర్‌)కి ఓ కాఫీ ఎస్టేట్‌ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్‌) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్‌, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. 

చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్‌ జైలులో ఉన్న మహారాజ్‌(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్‌ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్‌ ఇంజనీర్‌ సీతారాం(బాలకృష్ణ), చంబల్‌ డాన్‌ బల్వంత్‌ ఠాకూర్‌(బాబీ డియోల్‌) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్‌), కావేరి(ప్రగ్యా జైస్వాల్‌) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్‌లో సినిమా చూడాల్సిందే. 
 

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)