ధురంధర్‌లో ఆఫర్‌.. క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Published on Sun, 02/15/2026 - 12:15

గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సినిమా ధురంధర్‌. మౌత్‌ టాక్‌తోనే క్రేజ్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ము దులుపుతోంది.

అక్షయ్‌పై సర్వత్రా ప్రశంసలు
రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో అక్షయ్‌ ఖన్నా, ఆర్‌. మాధవన్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమా రిలీజయ్యాక అందరికన్నా ఎక్కువగా అక్షయ్‌ పేరే మారుమోగిపోయింది. అతడి స్వాగ్‌, డ్యాన్స్‌, లుక్స్‌ జనాలకు విపరీతంగా నచ్చేసింది. రెహ్మాన్‌ డకాయిట్‌గా అక్షయ్‌ అదరగొట్టేశాడని ప్రశంసలు లభించాయి.

స్పందించిన నాగ్‌
అయితే రెహ్మాన్‌ పాత్ర కోసం అక్షయ్‌ కంటే ముందు నాగార్జునను సంప్రదించారని ఓ వార్త ఫిల్మీదునియాలో వైరలవుతోంది. తాజాగా ఈ ప్రచారాన్ని కింగ్‌ నాగ్‌ కొట్టిపారేశాడు. ధురంధర్‌ సినిమా కోసం తనను సంప్రదించలేదని కుండ బద్ధలు కొట్టాడు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ధురంధర్‌ మూవీ చాలా బాగుందన్నాడు. 

సినిమా
ఆదిత్య ధర్‌ దర్శకత్వం అదిరిపోయిందని, అతడి ముందు సినిమా ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌ కూడా తనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించాడు. సినిమాలో అందరూ బాగా నటించారని, అక్షయ్‌ ఖన్నా అద్భుతంగా యాక్ట్‌ చేశాడని మెచ్చుకున్నాడు. ధురంధర్‌ సీక్వెల్‌ కూడా మరింత బ్లాక్‌బస్టర్‌ అవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ధురంధర్‌ 2 మూవీ మార్చి 19న విడుదలవుతోంది.

చదవండి: కపుల్‌ ఫ్రెండ్లీకి హిట్‌ టాక్‌.. తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతంటే?

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)