5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
నాగచైతన్య వృషకర్మ.. ట్రైలర్ వచ్చేసింది
Published on Thu, 11/26/2026 - 10:04
నాగచైతన్య హీరోగా నటించిన లేటేస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమాకు విరూపాక్ష ఫేం కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
(ఇది చదవండి: 24 రూపాయలతో వచ్చి.. రూ.కోటి పట్టుకెళ్లాడు)
ఈ ట్రైలర్ చూస్తుంటే అతీంద్రియ శక్తుల కథాంశం నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో వచ్చే సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ కథను మైథాలజీతో పాటు థ్రిల్లర్‌గా రూపొందించినట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. 'మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చబోతున్న ఓ అతీంద్రియ శక్తి.. ఈ భూమిపై తిష్టవేసింది' అనే డైలాగ్ మరింత ఆసక్తి కలిగిస్తోంది. కాగా.. ఈ సినిమాకు అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు.
Tags : 1