Breaking News

అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య

Published on Tue, 07/12/2022 - 19:55

అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ను 'ఇట్స్‌ ఏ లాంగ్‌ జర్నీ మై ఫ్రెండ్‌' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్‌తో ముగించారు. లవ్‌ ఫీల్‌తో ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్‌. క్లాస్, మాస్ గెటప్‌లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్‌, తమన్‌ సంగీతం బాగుంది. లవ్, కెరీర్‌ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. 

చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్‌
'ఆర్‌ఆర్‌ఆర్‌'పై పోర్న్‌ స్టార్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ


Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)