Breaking News

ఇళయరాజా కుమార్తె, సంగీత దర్శకురాలు భవతారణి కన్నుమూత

Published on Fri, 01/26/2024 - 03:44

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని భవతారణి రాజా (47) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ గురువారం రాత్రి శ్రీలంకలో కన్నుమూశారు. నేడు ఆమె  భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. శుక్రవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్‌ రాజా, యువన్ శంకర్‌ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ  సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు.

మలయాళ త్రీడీ ‘మై డియర్‌ కుట్టి చాత్తాన్‌’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్‌కి పరిచయమయ్యారు భవతారణి. అదే విధంగా ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారామె. తెలుగులోనూ పలు పాటలు పాడారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. దాదాపు పాతిక చిత్రాల్లో పాటలు పాడారు.

తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్‌: మై ఫ్రెండ్‌’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్‌ ఖాన్, అభిషేక్‌ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్‌ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు.

హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో ‘అవునా’(2003), కన్నడలో ‘గీయా గీయా’ (2005) సినిమాలకు సంగీతం అందించారు భవతారణి. దాదాపు పది చిత్రాలకు సంగీతదర్శకురాలిగా చేశారు. అడ్వరై్టజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్‌. శబరిరాజ్‌తో భవతారణి వివాహం జరిగింది. వీరికి  సంతానం లేరు. భవతారిణి మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)