Breaking News

హతవిధి.. ధనుష్‌ వాయిస్‌లో ఉన్న మ్యాజిక్కే వేరు!

Published on Wed, 05/31/2023 - 15:37

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్‌కు మంచి స్పందన లభించింది. బుధవారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను హీరో ధనుష్ పాడడం విశేషం.

ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ పాడి అలరించాడు. అందుకే సింగర్‌గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి డి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్‌కు మరింత వన్నె తెచ్చాడీ హీరో. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్‌తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్‌లో ఏది గొప్పగా చేయాలనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్‌తో సాంగ్ కొనసాగుతుంది.

అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించాడు. లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇంత మంచి లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రి అందించడం విశేషం. ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది.

చదవండి: చాతిపై పవర్‌ స్టార్‌ పచ్చబొట్టు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)