Breaking News

తెలుగులో ఫ్లాఫ్.. అక్కడ మాత్రం హిట్.. అందుకేనా?

Published on Thu, 09/17/2026 - 17:46

సినీ ప్రేక్షకుల గుండెల్లో సూపర్ హిట్‌గా నిలిచిపోయిన సిరీస్‌ మీర్జాపూర్. ఈ సిరీస్‌ మూడు సీజన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌లో తెరకెక్కించినప్పటికీ ఇతర భాషల్లో సత్తా చాటింది. దీంతో ఈ వెబ్ సిరీస్‌లను మూవీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మీర్జాపూర్ ది మూవీ పేరుతో రిలీజ్ చేశారు.

అయితే వెబ్ సిరీస్‌కు లభించినంత ఆదరణ ఈ సినిమాకు లభిస్తుందని మేకర్స్ భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.  పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తెలుగులో అయితే ఈ సినిమాకు ఆదరణ కరువైంది. ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడంతో తెలుగులో కొద్దిపాటి వసూళ్లకే పరిమితమైంది.

హిందీలో మాత్రం..

దక్షిణాది భాషల్లో లభించని ఆదరణ బాలీవుడ్‌లో మాత్రం దక్కుతోంది.  హిందీ మార్కెట్‌లో ఈ మూవీకి  రూ.150 కోట్లకి పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. హనుమాన్ అంశ్ లాంటి మూవీ పోటీ ఉన్నప్పటికీ మీర్జాపూర్ మాత్రం కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. హిందీలో వసూళ్లు ఫర్వాలేదనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే రూ.200 కోట్ల వసూళ్లు సాధించేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఫీట్ అందుకుంటుందేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

 

Videos

Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు

పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..

నిజామాబాద్ నగరంలో దారుణం

Kakinada: పెళ్లి బస్సును ఢీకొట్టిన ట్రక్కు బస్సు బోల్తా

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)