Breaking News

ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా

Published on Mon, 09/22/2025 - 17:48

మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?) 

'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎ‍స్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.

ఈ వారం ఓటీటీల్లో 'మేఘాలు చెప్పన ప్రేమకథ' కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వీటితో పాటు సడన్ సర్‌ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)