Breaking News

'చిరంజీవికి 106 డిగ్రీల జ్వరం.. శ్రీదేవి వల్ల ఆ సాంగ్‌ చేయాల్సి వచ్చింది'

Published on Sun, 05/04/2025 - 18:54

తెలుగు చిత్రసీమ చరిత్రలోనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సూపర్ హిట్‌  చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో-ఫాంటసీ చిత్రం విడుదలై 35 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.  మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా   వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు.

కాగా.. మే 9వ తేదీ 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి థియేటర్లలో విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ అనేలా ఈ మూవీ నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలైనప్పుడు దాని క్రేజ్‌ గురించి ఒక్క మాటలో ఓ ఉదాహరణగా చెప్పాలంటే.. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్‌లో రూ. 210 వరకు అమ్మేశారట. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అబ్బనీ తీయని దెబ్బ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి.
 

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. 'ఈ పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో బాగుందా? లేదా వినండి అంటూ ఇళయరాజా మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌తో పాటు నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సింపుల్‌గా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి సాహిత్యం రాశారు. బాలు, చిత్ర గారు అలా సరదాగా పాడేశారు'అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. ‘అందాలలో’ అనే పాట గురించి దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. 'కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాము. ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే' అని అన్నారు.

‘దినక్కుతా’ అనే పాట గురించి అశ్వనీదత్ మాట్లాడుతూ .. ‘ఈ పాటను షూట్ చేసే టైమ్‌కి చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో.. మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి  కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళ్లనుంది. మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్‌లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు’ అని అన్నారు.

శ్రీదేవి గతంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి మాట్లాడుతూ..  'ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ‘ప్రియతమ’ సాంగ్‌ అని అన్నారు. అది చాలా అందమైన మెలోడీ. రాఘవేంద్రరావు  దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు, సైగలతోనే కంపోజ్ చేయించారు. అది మరపురాని పాట అని ఆమె అన్నారు. కాగా.. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్లు అజయన్ విన్సెంట్, కె.ఎస్. ప్రకాష్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ‘మాస్ట్రో’ ఇళయరాజా ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్‌ప్లేను జంధ్యాల అందించారు. ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలాన్ని మే 9న 2డీ, 3డీ ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి.
 

 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)