Breaking News

హీరోగా పెద రాయుడు బాలనటుడు ఎంట్రీ.. ఆసక్తిగా టీజర్

Published on Thu, 12/18/2025 - 15:37

మాస్టర్ మహేంద్రన్.. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు. అయితే పెద్దరాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు.  'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్‌కు విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడు మన మహేంద్రనే. అప్పటి పిల్లాడే.. ఇప్పుడు హీరో అయ్యాడు.

మహేంద్రన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నీలకంఠ'. ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యష్నా చౌదరి, నేహా పఠాన్ కథానాయికలుగా నటించారు. మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కీలక పాత్రలో కనిపించారు. ఎల్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 2 విడుదలకు సిద్ధమైంది. నైజాంలో బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. 
 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)