Breaking News

రవితేజ- శ్రీలీల 'సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌'.. చూశారా?

Published on Wed, 10/22/2025 - 16:05

మాస్‌ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్‌ మూవీ మాస్‌ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్‌బస్టర్‌ ఆల్బమ్‌ ఇచ్చిన భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్‌ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్‌ రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్‌ చేశారు.

సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌
అదే సూపర్‌ డూపర్‌ హిట్టు సాంగ్‌! ఈ పాటకు రిథమ్‌ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్‌ హిట్టని లిరిక్స్‌లోనే చెప్తున్నారు. రోహిణి‌, భీమ్స్‌ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్‌ హిట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్‌ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్‌ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో  ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

 

చదవండి: నటి గ్లామర్‌ పిక్స్‌ షేర్‌ చేసిన ఉదయనిధి స్టాలిన్‌.. ఎంత పనైపోయింది?

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి