కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!

Published on Mon, 06/09/2025 - 21:27

కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.

అసలేంటి వివాదం..?

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో  ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

'మంచు మోహన్‌బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్  హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.

కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)