Breaking News

కన్నప్ప హార్డ్‌ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!

Published on Wed, 06/04/2025 - 10:58

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఆ హార్డ్ డిస్క్ ఇంకా తనవద్దకు రాలేదని చెప్పారు.

విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప కోసం ముంబయిలో దాదాపు 8 కంపెనీలు వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్‌లైన్‌లో కొంత భాగం పంపించారు. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్‌లోడ్‌ చేశారు. ముందు జాగ్రత్త కోసమే వాళ్లు ఓ హార్డ్‌డిస్క్‌ కూడా పంపారు. మా ముగ్గురికి సంబంధించి ఏ పార్సిల్‌ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్‌ అడ్రస్‌ కూడా నాన్న ఇంటిదే ఉంటుంది. అక్కడికి పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళను తీసుకోమని చెప్పారట. ఆమెనే తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే.. వాళ్లిద్దరు మనోజ్‌ దగ్గర పని చేస్తారో.. లేదో మాకు తెలియదు. అతని వద్దే ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్‌డిస్క్‌ కూడా అక్కడే ఉందని తెలిసింది. ఇప్పటివరకైతే హార్డ్‌డిస్క్ నా చేతికి రాలేదు' అని అన్నారు.
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)