నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

Published on Tue, 05/27/2025 - 16:33

మంచు విష‍్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎ‍ప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్‌ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్‌లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్‌కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్‌ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

ఇ‍ప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్‌గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.

ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్‪‌కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)