Breaking News

న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్‌ వైరల్!

Published on Thu, 06/26/2025 - 22:24

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్‌ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

న్యూజిలాండ్‌లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.

 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)