Breaking News

మంచు విష్ణు కన్నప్ప.. ఆయన కుమార్తెల సాంగ్ ప్రోమో చూశారా?

Published on Tue, 05/27/2025 - 15:24

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు.  ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్‌.. రెబల్ స్టార్‌ పాత్రపై మంచు విష‍్ణు ఆసక్తికర కామెంట్స్)

ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)