నాలోని దుష్టశక్తి పోవాలని నా భార్య అలా చేస్తుంది: మంచు విష్ణు

Published on Mon, 06/23/2025 - 13:50

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తెగ ప్రమోషన్లు చేస్తున్న విష్ణు.. ఒకటి రెండు రోజుల్లో శ్రీకాళహస్తిలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ రంగన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమా అంటే నాకు ఇష్టం. 'కన్నప్ప' కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలానే నేను హార్డ్ కోర్ హిందువుని.. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజూ బైబిల్ చదువుతుంది. అలానే రోజూ నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?) 

ఇప్పటివరకు వచ్చిన 'కన్నప్ప' సినిమాల్లో క్లైమాక్స్ ఒక్కటే అయినా.. అంతకు ముందు సన్నివేశాల్ని మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దాదాపు 50 ఏళ్ల తర్వాత, ప్రస్తుత జనరేషన్‌కి చూపించేందుకు తాను 'కన్నప్ప' తీశానని, శివుడి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని విష్ణు అన్నాడు.

భారీ బడ్జెట్‌తో తీసిన 'కన్నప్ప'లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమాపై కూడా కాస్తోకూస్తో అంచనాలు ఉన్నాయి. గతవారం థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' హిట్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆ జోష్‌ని 'కన్నప్ప' కూడా కొనసాగిస్తుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలుస్తుంది.

(ఇదీ చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష) 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)