నెలలోపే ఓటీటీలోకి మంచు లక్ష్మీ థ్రిల్లర్ సినిమా

Published on Wed, 10/15/2025 - 12:55

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు లక్ష్మీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ చెప్పుకోదగ్గ సినిమాలే రీసెంట్ టైంలో ఏం రాలేదు. కొన్నాళ్ల క్రితం ఓటీటీ కోసం హిందీలో ఓ షో చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గత నెలలో లీడ్ రోల్ చేసిన ఓ తెలుగు సినిమా రిలీజైంది. ఇప్పుడది ఓటీటీలోకి కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్)

మంచు లక్ష్మీ పోలీస్‌గా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దక్ష'. మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించారు. మర్డరీ మిస్టర్ థ్రిల్లర్ స్టోరీతో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వస్తే.. వచ్చిన విషయం కూడా చాలామందికి తెలియనంత వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు అక్టోబరు 17 నుంచి అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మంచు లక్ష‍్మీనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. మరి బిగ్ స్క్రీన్‌పై తేలిపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?

'దక్ష' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. మరోవైపు  దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు. అతడు సేకరించిన సమాచారంతో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇంతకీ హత్యలు చేసింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా)కు సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)