Breaking News

'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published on Sat, 01/31/2026 - 08:30

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్'కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి జనాలు ఎంతలా చూశారో అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ పరంగా రొటీన్ అనే విమర్శలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఇది క్లిక్ అయింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని, స్ట్రీమింగ్ డేట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.

నటుడిగా రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఆ లోటుని 'మన శంకరవరప్రసాద్' తీర్చేసినట్లే కనిపిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార నటించగా.. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని.. ఫిబ్రవరి 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులు అటుఇటు అయినా సరే వచ్చే నెల రెండో వారం ఓటీటీ రిలీజ్ పక్కా అని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))

'మన శంకరవరప్రసాద్' విషయానికొస్తే.. నేషనల్ సెక్యూరిటీ అధికారి శంకరవరప్రసాద్ (చిరంజీవి).. కేంద్రమంత్రి శర్మ రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటాడు. మంత్రి కూడా శంకర్‌ని కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఉంటాడు. శంకర్ గతంలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ జీవీఆర్ కుమార్తె శశిరేఖని పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నాళ్లకు విడాకులు తీసుకుంటారు. దీంతో పిల్లల్ని చూసే ఛాన్స్ కూడా శంకర్‌కి ఉండదు. ఇది తెలుసుకున్న కేంద్రమంత్రి.. పిల్లలతో సమయం గడిపేలా వాళ్లు చదువుతున్న స్కూల్‌లో పీఈటీగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కొన్నాళ్లకు శంకర్.. పిల్లలకు దగ్గరగానే ఉన్నాడని శశిరేఖకు తెలుస్తోంది. ఇదే టైంలో జీవీఆర్‌పై దాడి జరగుతుంది. దీంతో మాజీ భార్య ఇంటికే శంకర్.. సెక్యూరిటీ కోసం వస్తాడు. తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్-శశిరేఖ ఎందుకు విడిపోయారు? అనేదే మిగతా స్టోరీ.

సంక్రాంతి సినిమాల ఓటీటీ డీటైల్స్ విషయానికొస్తే.. ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రాన్ని ఫిబ్రవరి 6 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' మూవీని ఫిబ్రవరి 4 నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేయనున్నారు. ఇది కూడా అనౌన్స్ చేశారు. 

(ఇదీ చదవండి: కార్తీ 'అన్నగారు వస్తారు' సినిమా రివ్యూ)

Videos

అక్రమంగా భూములు తీసుకోవడమే కాదు.. GVMC కౌన్సెల్ గోడపై YSRCP నేతలు ఫైర్

నయనతార మూవీ లైనప్ .! బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

USA: నో వర్క్ .. నో స్కూల్ .. నో షాపింగ్

Chelluboyina: లడ్డూ కల్తీ కాదు.. చంద్రబాబే పెద్ద కల్తీ

అంబటిపై దాడి YSRCP శ్రేణుల ఆగ్రహం

Srinivas: నువ్వు సీఎంగా ఉన్నప్పుడు తీసిన శాంపిల్స్ లోనే

నితిన్ వదులుకున్నవి అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే..!

Margani : తిరుపతి ప్రెస్టేజ్ పోయింది YSRCP పాప ప్రక్షాళన పూజలు

అమెరికాలో మరోసారి షట్ డౌన్..

అరవ శ్రీధర్‌ మరో రెండు వీడియోలు రిలీజ్

Photos

+5

తిరుమల శ్రీవారిలో సేవలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)

+5

నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)

+5

నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)

+5

అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)