Breaking News

ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Mon, 12/29/2025 - 21:11

ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.

(ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)

ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.

'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్‌ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.

(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)