Breaking News

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి

Published on Mon, 06/05/2023 - 10:40

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లం సుధీ(39) మృతి చెందారు. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు మిమిక్రీ కళాకారులు బిను ఆదిమాలి, ఉల్లాస్, మహేశ్ ప్రస్తుతం సమీపంలోని కొడుంగలూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సుధీ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

(ఇది చదవండి: రాహుల్ సిప్లిగంజ్‌ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!)

ఎలా జరిగిందంటే..

సుధి, మిగిలిన ముగ్గురు వటకరా ప్రాంతంలో ఒక ఈవెంట్‌ను ముగించుకుని కారులో తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధీ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

కొల్లం సుధీ కెరీర్

కొల్లం సుధీ 2015లో అజ్మల్ దర్శకత్వం వహించిన కంఠారి చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనాదన్ మార్ప్పప్ప, కేసు ఈ వీడింటే నాధన్, 'ఎస్కేప్', స్వర్గతిలే కత్తురుంబు కొల్లం వంటి సినిమాల్లో నటించాడు. సుధీ చాలా చిత్రాలలో కనిపించినప్పటికీ.. అతను బుల్లితెరపై నటనకే ఎక్కువ ప్రశంసలు అందుకున్నాడు. కొల్లం సుధీ తన మిమిక్రీతోనే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అతను స్టార్ మ్యాజిక్ షోతో మరింత ఫేమ్ సంపాదించారు. మలయాళంలో పలు కామెడీ షోలతో అలరించాడు.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)