Breaking News

ఆశ్చర్యం.. ఐటమ్ బ్యూటీ ఇంత మోసం చేసిందా?

Published on Fri, 10/24/2025 - 17:56

సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?

ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్‌గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) 

సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్‌పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అ‍ర్భాజ్ ఖాన్‌ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్‌కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉంటోంది.

(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)