Breaking News

కూతురి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా?

Published on Fri, 06/13/2025 - 13:12

సెలబ్రిటీలు అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కావు. పిల్లల పక్కన నిల్చుంటే వారికి అక్కలానో, అన్నలానో ఉంటున్నారు తప్ప పేరెంట్స్‌లా మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ కూడా అంతే! ఇంతకీ కూతురి బర్త్‌డేకు కేక్‌ కట్‌ చేయించి తనకు ప్రేమగా తినిపిస్తున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

ఫేమస్‌ సాంగ్‌..
తెలుగులో ఓ ఫేమస్‌ పాటతో ఓ ఊపు ఊపేసింది. ప్రేమ.. ఓ ప్రేమ.. వచ్చావా ప్రేమ.. అనుకుంటేనే ఉన్నా రామ్మా.. అంటూ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆవిడే మహిమ చౌదరి (Mahima Chaudhry). శ్రీకాంత్‌, జగపతిబాబు నటించిన 'మనసులో మాట' సినిమాలోనిదే ఈ పాట. ఎక్కువగా హిందీ సినిమాలే చేసిన మహిమ 2016 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. కానీ, 8 ఏళ్ల తర్వాత ద సిగ్నేచర్‌ అనే హిందీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది వచ్చిన ఎమర్జెన్సీ, నడానియన్‌ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. 

కూతురి బర్త్‌డే..
తన కూతురు అరియానా పుట్టినరోజు సెలబ్రేషన్స్‌ను అభిమానులతో పంచుకుంది. హ్యాపీ బర్త్‌డే మై బేబీ అని క్యాప్షన్‌ జోడించింది. ఇక ఈ వీడియోలో తల్లి చేతుల్ని పట్టుకుని నమస్కరించింది అరియానా. ఆ తర్వాతే క్యాండిల్స్‌ ఊది కేక్‌ కట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు.. మహిమ అసలు తల్లిలా కాదు, ఆమెకు అక్కలా కనిపిస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు.

అందమైన కూతురు
అరియానా ఇటీవలే తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. తనను చాలా మంది అయితే హాలీవుడ్‌ నటి సెలీనా గోమెజ్‌తో లేదంటే పాతకాలం నాటి అమూల్‌ యాడ్‌లో కనిపించే అమాయకపు అమ్మాయితో పోలుస్తారు. షారూఖ్‌ ఖాన్‌ పర్దేశ్‌ సినిమాతో కెరీర్‌ ఆరంభించిన మహిమా 35కు పైగా సినిమాలు చేసింది. 2022లో రొమ్ము క్యాన్సర్‌ బారిన పడగా.. ఆత్మస్థైర్యంతో దాన్ని జయించింది.

 

 

చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)