Breaking News

ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో ఆడియన్స్ ఫుల్ డిసప్పాయింట్!

Published on Sun, 02/11/2024 - 15:35

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.  ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ఈనెల 9న ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వర్షన్‍లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

థియేటర్లలో రిలీజైన నెలలోపే గుంటూరు కారం  స్ట్రీమింగ్‍కు  వచ్చేసింది. దీంతో ఓటీటీలోనూ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. డబ్బింగ్ వర్షన్‌పై మాత్ర పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.  ముఖ్యంగా శాండల్‌వుడ్‌ ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

దీంతో గుంటూరు కారం సినిమా కన్నడ వర్షన్‍పై కన్నడ ప్రేక్షకులు అసంతృప్తి చేస్తున్నారు. ట్రాన్స్‌లేషన్‍తో పాటు వాయిస్‍ ఓవర్‌ కూడా అసలు బాగాలేదని సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద సినిమా అయినప్పటికీ డబ్బింగ్‍ను తూతూ మంత్రంగా కానిచ్చేశారని మండిపడుతున్నారు. గుంటూరు కారం తమిళ డబ్బింగ్ వర్షన్‌లో కొందరు నెటిజన్లు  విమర్శిస్తున్నారు. 

ఈ సినిమాలో ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఊపేసిన మాస్ సాంగ్ ‘కుర్చీ మడత పెట్టి’ ఫుల్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ డబ్బింగ్‍ వర్షన్‌లో పేలవంగా ఉందని మరికొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. అన్ని భాషల్లో ఒరిజినల్ సాంగ్ ఉంటేనే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు నెట్‍ఫ్లిక్స్‌లో గుంటూరు కారం నెట్‌ప్లిక్స్‌లో దూసుకెళ‍్తోంది. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)