Breaking News

మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు

Published on Wed, 10/29/2025 - 17:06

ఇండస్ట్రీలో ఒకే కుటుంబం నుంచి ఎక్కువమంది వారసులు అనగానే మెగా లేదంటే నందమూరి ఫ్యామిలీలే గుర్తొస్తాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి హీరోలు ఉన్నప్పటికీ వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారు. త్వరలో ఈ లిస్టులోకి ఘట్టమేనేని కుటుంబం కూడా చేరనుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు ఏకంగా ఏడుగురు వరకు వారసులు.. రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: 'బాహుబలి', 'మాస్ జాతర' కోస‍ం సైడ్ అయిపోయిన హీరో)

సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా రమేశ్ బాబు, మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ రమేశ్ బాబు పెద్దగా నిలదొక్కుకోలేకపోయాడు. మహేశ్ బాబు మాత్రం స్టార్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం రాజమౌళితో మూవీ చేస్తున్నాడు. మహేశ్ అక్క మంజుల పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు తప్పితే హీరోయిన్ కాలేకపోయారు.

తర్వాత తరానికి వస్తే.. మహేశ్ బాబు చెల్లి ప్రియదర్శని భర్త సుధీర్ బాబు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. గల్లా జయదేవ్ కొడుకు అంటే మహేశ్‌కి మేనల్లుడు అశోక గల్లా కూడా హీరోగా రెండు మూడు మూవీస్ చేశాడు. కాకపోతే పెద్దగా గుర్తింపు రాలేదు. వీళ్ల కాకుండా ఇప్పుడు తర్వాత తరం కూడా చాలామంది సిద్ధమైపోయారు. కొందరు అవుతున్నారు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

ముందుగా మహేశ్ కొడుకు గౌతమ్ విషయానికొస్తే ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఎంట్రీ ఉండొచ్చు. కూతురు సితార ఇప్పటికే తండ్రితో కలిసి పలు యాడ్స్ చేసింది. సినిమాల్లోని పాటల్లోనూ అతిథిగా కనిపించింది. ఈమెది ఇంకా చిన్న వయసే. కాబట్టి హీరోయిన్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.

మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పటికే హీరోగా తొలి సినిమా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తీయబోయే కొత్త సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నాడని టాక్. రమశ్ బాబు కుమార్తె భారతి కూడా నటి అయ్యేందుకు ఆసక్తి ఉందని తెలుస్తోంది.

తాజాగా మహేశ్ సోదరి మంజుల కూడా తన కూతురు జాన్వి.. త్వరలో సినిమాల్లోకి రానుందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈమె కూడా త్వరలోనే హీరోయిన్ అయ్యేలా కనిపిస్తుంది. మరోవైపు సుధీర్ బాబు కూడా తన కొడుకుల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని చాన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే పెద్ద కొడుకు చరిత్ మాసస్.. ఇప్పటికే అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటుండగా.. చిన్న కొడుకు దర్శన్ కూడా 'ఫౌజీ'లో యంగ్ ప్రభాస్‌గా కనిపించబోతున్నాడని టాక్.

పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఒకరిద్దరూ కాదు ఏకంగా ఏడుగురు వారసులు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రాబోయే కొన్నేళ్లలో ఇండస్ట్రీలోకి రాబోతున్నారనమాట. మరి వీళ్లలో ఎవరు ఎప్పుడొస్తారు? ఎవరు నిలదొక్కుకుంటారనేది చూడాలి?

(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)