సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు
Breaking News
ఓటీటీలో 'లస్ట్ స్టోరీస్ 3' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
Published on Sun, 09/06/2026 - 09:15
ఓటీటీల్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. అదే టైంలో కొన్ని సిరీస్‌లు కూడా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయి. అలా దాదాపు ఎనిమిదేళ్ల క్రితం రిలీజై సెన్సేషన్ సృష్టించిన సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. తర్వాత కాలంలో దీనికి రెండో పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ కూడా సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి ఓ వీడియోని విడుదల చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఆంథాలజీ ఫ్రాంచైజీ 'లస్ట్ స్టోరీస్' మూడో భాగాన్ని ఈనె 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్లో ఉండే నాలుగు కథలకు విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఆకర్షణ, సంబంధాలు, అణచివేసిన కోరికలు అనే అంశాల ఆధారంగా వీటిని తెరకెక్కించారు. ఈ సీజన్లో రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరీ, రాధికా మదన్, సనా థంపి, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, సిద్ధార్థ్, అలీ ఫజల్, గుర్ఫతేహ్ పిర్జాదా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు.
‘లస్ట్ స్టోరీస్’ ఫ్రాంచైజీ 2018లో ప్రారంభమైంది. తొలి భాగంలోని స్టోరీలకు అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ విడుదలైంది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది.మరి ఇదెలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'బందర్' సినిమా.. తెలుగు రివ్యూ)
I won’t tell this to y’all but I am too excitedddd 🤭❤️🔥 pic.twitter.com/7jQlq9MAXw
— Netflix India (@NetflixIndia) September 5, 2026
Tags : 1