Breaking News

ఎట్టకేలకు ఓటీటీలోకి 'లోక' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Fri, 10/24/2025 - 13:38

సూపర్ హీరోల సినిమాలు సరిగ్గా తీయాలే గానీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. హాలీవుడ్‌లో ఈ తరహా మూవీస్ ఎక్కువగా తీస్తుంటారు. మన దేశంలో మాత్రం ఆడపాదడపా మాత్రమే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ జానర్ అనగానే చాలామంది హీరోలతోనే తీస్తుంటారు. కానీ ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లోక'. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.

కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 28న మలయాళంలో, 29న తెలుగులో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది. కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్ పెట్టగా.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. లెక్క ప్రకారం ఓటీటీలోకి ఎప్పుడో వచ్చేయాలి. కానీ థియేటర్లలో బాగా ఆడేసరికి కాస్త ఆలస్యం చేశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా)

ఈ నెల 31 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి హాట్‌స్టార్‌లో 'లోక' అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈ సినిమా బాగా నచ్చేయగా.. మరికొందరికి మాత్రం ఓకే ఓకే అనిపించింది. మరి ఓటీటీలోకి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?

'లోక' విషయానికొస్తే.. చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. దీని గురించి కొందరికే తెలుసు. కొన్ని కారణాల వల్ల చంద్ర.. బెంగళూరు వచ్చేస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతూ కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. చంద్రని చూసి తొలిచూపులోనే సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. అసలు ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)